September 5, 2022
దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్న ‘అల్లరి’ నరేశ్‌కు ‘నాంది’ సినిమాతో ఓ బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చారు దర్శకుడు విజయ్ కనకమేడల. గత ఏడాది ఫిబ్రవరి 19న విడుదలైన ఈ సినిమాకుప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. నాలుగుకోట్లతో రూపొందిన ఈ సినిమా థియేటర్స్‌లో దా దాపు పది కోట్ల రూపాయాలను వసూలు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని నరేశ్ నటనకు ప్రేక్షకులు,విమర్శకులు మంచి మార్కలు వేశారు. దీంతో ‘నాంది’ఇచ్చిన హిట్‌తో హీరో అల్లరి నరేశ్, దర్శకుడు విజ య్ మరోసారి రెడీ అయ్యారు. ‘ఉగ్రం’ అనే సినిమా చేస్తున్నారు. మిర్నా మీనన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబరు 5 సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెగ్యులర్‌షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా ‘ఉగ్రం’ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రం యూనిట్.
ఇక ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన మరో చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్ మోహన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించనున్నారు అల్లరి నరేశ్. ఈ సినిమా ఈ ఏడాదేరిలీజ్ కానుంది.