February 4, 2022
Allu Arjun: గద్దల కొండ గణేష్ తర్వాత కొంత విరామం తీసుకుని మళ్లీ పవన్ కల్యాణ్ తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా ద్వారా వార్తల్లోకి ఎక్కాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. పవన్ కల్యాణ్ కి భక్తుడిగా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ మెగా కాంపౌండ్‌కి బాగా కావాల్సిన వాడు. అల్లు అర్జున్(Allu Arjun)తో తీసిన డీజే కమర్షియల్‌గా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ సినిమా బాలీవుడ్‌కి వెళ్తుంది కూడా.. ఇక వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ కమర్షియల్‌గా నిరాశపరిచింది.
అయితే ఇటీవల హరీష్ శంకర్ అల్లు అర్జున్ ని కలిశాడు. ఈ సందర్భంగా ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ `తగ్గేదే లే.. ఎందుకు తగ్గాలి.. బన్నీతో ఎప్పుడు కలిసినా సరదాగా ఉంటుంది.. లవ్ యూ బన్నీ` అని రాశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది దాంతో సడన్‌గా ఇప్పుడు వీరిద్దరూ ఎందుకు కలిశారన్న చర్చ టాలీవుడ్ లో మొదలైంది. భవదీయుడు తర్వాత బన్నీతో హరీష్ శంకర్ సినిమా ఉంటుంది అని కొందరు అంటుంటే లేదు డీజే సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నాడు హరీష్. ఆ సినిమాకి సంబంధించి కొన్ని మార్పుల విషయంలో బన్నీతో చర్చించడానికి హరీష్ వెళ్లాడని మరో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా డీజే కాంబినేషన్ కనుక మళ్లీ రిపీట్ అయితే ఈ సారి మరింత భారీ హిట్ సాధించడం ఖాయం అనిపిస్తోంది.
Read More: పవన్ సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్ సెట్..డైరెక్టర్ ఎవరో తెలుసా?