December 13, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పుష్ప2 సినిమా ప్రీమియర్‌షో సమయంలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఆయన సంధ్య థియేటర్‌కు రావడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌ను కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మరోవైపు సంధ్య థియేటర్ యాజమాన్యం మాత్రం మేము ప్రీమియర్‌షోకి రెండు రోజుల ముందే పోలీస్ ప్రొటక్షన్ కావాలని కోరాం అని దానికి సంబందించిన లెటర్‌ని చూపిస్తుంది. ఈ వాధనల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి దంపతులు నిర్మాత అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తరలించారు.