December 13, 2024
పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ ను తరలించి గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అల్లుఅర్జున్‌కు వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం నాంపల్లి కోర్డుకు తరలించారు. అక్కడ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
అల్లు అర్జున్‌ను రిమాండ్ ఖైదీల బ్యారక్‌లో ఉంచనున్నారు. సెలబ్రిటీ కావడంతో నేరస్తులకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంచుతారు. విఐపీ కావడంతో ఆయనకు జైలులో ప్రత్యేక గదిని కేటాయించే అవకాశం ఉంది. పాపులర్ సినీ నటుడు కావడంతో ఆయనకు జైలులో కొన్ని ప్రత్యేక వసతులు కల్పించే అవకాశం ఉంది. రిమాండ్ ఖైదీల్లో ప్రముఖ వ్యక్తులు ఉంటే ఇంటి భోజనాన్ని అనుమతిస్తారు. రిమాండ్ ఖైదీలు అందరితో పాటు కాకుండా ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తారు. ఆ గది చుట్టూ భద్రత ఏర్పాటు చేస్తారు.