నా మనసుకు నచ్చిన వాళ్లకి నేను సపోర్ట్ చేస్తాను.. వైసీపీ ప్రచారంపై బన్నీ కామెంట్!

May 11, 2024

నా మనసుకు నచ్చిన వాళ్లకి నేను సపోర్ట్ చేస్తాను.. వైసీపీ ప్రచారంపై బన్నీ కామెంట్!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా మెగా హీరోలు కూడా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో కాస్త ఆసక్తికరంగా మారాయి. అయితే జనసేన పార్టీకి మద్దతు తెలిపినటువంటి అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన అల్లు అర్జున్ వైసీపీకి ప్రచారం చేయడంతో మెగా అభిమానులు పవన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ కు మంచి స్నేహితుడు కావడంతో తన స్నేహితుడికి సపోర్ట్ చేయడం కోసమే నంద్యాలకు అల్లు అర్జున్ వచ్చారు.

ఇక అల్లు అర్జున్ వస్తున్నారని విషయం తెలిసి భారీగా అక్కడికి అభిమానులు చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవి తనకు చాలా మంచి స్నేహితుడని తెలిపారు. రవి నన్ను ప్రచారానికి రమ్మని అడగలేదని నేనే రావాలని ఉంది తప్పకుండా వస్తాను అంటూ ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నానని తెలిపారు.

ఇక నా స్నేహితులు ఏ ఫీల్డ్ లో ఉన్న వారికి నేను తప్పకుండా సహాయం చేస్తానని పార్టీలతో సంబంధం లేకుండా ప్రచార కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఇక నా మనసుకు నచ్చిన వాళ్లకు నేను సపోర్ట్ చేస్తాను అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ గా మారడంతో అంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మనసుకు నచ్చిన వారు కాదా అందుకే ఆయనకు సపోర్ట్ చేయలేదా అంటూ మరికొందరు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తూ ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.

Read More: డబుల్ ఇస్మార్ట్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందా.. పూరి పోస్ట్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు