ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్ పై దాడి చేసిన బన్నీ ఫ్యాన్స్.. అదే కారణమా?

June 7, 2024

ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్ పై దాడి చేసిన బన్నీ ఫ్యాన్స్.. అదే కారణమా?

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి ఇంకా చల్లారలేదని చెప్పాలి ఎన్నికలలో భాగంగా కూటమి అధికారంలోకి వచ్చింది అయితే టిడిపి నేతలు అందరూ కూడా ఇప్పటికే పలుచోట్ల వైఎస్ఆర్సిపి నేతల పై తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ కూటమి తరపున మద్దతు తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన వైఎస్ఆర్సిపి అభిమానులను మాత్రమే కాకుండా నేతలను అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సినీ నటుడు అల్లు అర్జున్ గురించి కూడా ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేసినప్పటికీ తన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శిల్ప రవి చంద్రకిషోర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ నంద్యాలకు వెళ్లిన సంగతి తెలిసిందే ఈ విషయంపై కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఓడిపోయాడని.. కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం నచ్చలేదని, దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని.. బన్నీ చేసింది ముమ్మాటికీ తప్పని RP కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా అల్లు అర్జున్ పట్ల అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ విమర్శలు చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్లో ఉండగా అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకొని ఈ చేపల పులుసు రెస్టారెంట్ పై దాడి చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఎక్కడ కూడా ఆర్పీ ఈ ఘటన గురించి ఇప్పటివరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు కారణమవుతుంది.

Read More: ప్రభాస్ కి వర్షం సినిమా కాకుండా ఆ సినిమా పాటలు అంటే అంత ఇష్టమా..?

ట్రెండింగ్ వార్తలు