ఆర్య సినిమా కోసం సూపర్ హిట్ మూవీని వదులుకున్న బన్నీ.. హిట్ కొట్టిన రవితేజ?

June 5, 2024

ఆర్య సినిమా కోసం సూపర్ హిట్ మూవీని వదులుకున్న బన్నీ.. హిట్ కొట్టిన రవితేజ?

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న స్క్రిప్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మరొకరు నటిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతోమంది హీరోలు తమ వరకు వచ్చిన కథలను మిస్ చేసుకోగా ఆ సినిమాలో ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా కూడా నిలిచిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం కెరియర్ మొదట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలన్నీ వదులుకున్నారని తెలుస్తుంది. ఈయన గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఇలా గంగోత్రి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ఏది కూడా కథ సరిగా లేకపోవడంతో సినిమా చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉండేవారట ఇలా కన్ఫ్యూజన్లో ఉన్న సమయంలోనే బోయపాటి శ్రీను భద్ర సినిమా కథతో అల్లు అర్జున్ వద్దకు వెళ్లారు. ఈ సినిమా కథ మొత్తం విన్నటువంటి బన్నీ ఇలాంటి ఒక యాక్షన్ మూవీ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అన్న ఆలోచనలో పడ్డారట.

ఏ విషయము అల్లు అర్జున్ బోయపాటికి చెప్పలేక ఈ సినిమా చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అన్న ఆలోచనలో పడ్డారట ఇలా కన్ఫ్యూజన్లో ఉన్న సమయంలో సుకుమార్ తనని కలిసినట్టు పలు సందర్భాలలో వెల్లడించారు. అయితే ప్రసాద్ ల్యాబ్ లో అల్లు అర్జున్ ను కలిసిన సుకుమార్ ఆర్య సినిమా కథ చెప్పడంతో ఈ సినిమా కథ చాలా ఎక్సైట్ గా అనిపించి బన్నీ ఓకే చేశారట.

ఇలా ఆర్య సినిమా బాగా నచ్చడంతో భద్ర సినిమాను రిజెక్ట్ చేశారు అయితే భద్ర సినిమాకు రవితేజ ఓకే చెప్పి ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఆర్య సినిమా కోసం బన్నీ మరో హిట్ సినిమాని వదులుకోగా ఆ సినిమా రవితేజకు చాలా ప్రయోజనకరంగా మారిందని చెప్పాలి. ఇకపోతే ఆర్య సినిమా ఇటీవల 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం మరోసారి గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read More: మెగా ఫ్యామిలీకి లక్కీగా మారిన క్లిన్ కారా.. అన్ని శుభాలే?

ట్రెండింగ్ వార్తలు