పవన్ విజయంపై రియాక్ట్ అయిన అల్లు అర్జున్.. ట్వీట్ వైరల్!

June 5, 2024

పవన్ విజయంపై రియాక్ట్ అయిన అల్లు అర్జున్.. ట్వీట్ వైరల్!

సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70 వేల మెజారిటీతో గెలిచిన సంగతి మనకు తెలిసిందే అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 21 స్థానాలలో పోటీ చేసినటువంటి జనసేన ఇరవై ఒక్క స్థానాలలో కూడా విజయం అందుకుంది. ఇలా 2024 ఎన్నికల ఫలితాలలో కూటమి భారీ మెజారిటీతో గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో సినిమా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందించి ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మరికొందరు వ్యక్తిగతంగా కలిసి తమ సంతోషాలను వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబం సైతం పవన్ కళ్యాణ్ గెలుపు పై స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. అయితే అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ గెలుపు గురించి స్పందించారు.

అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్. మీరు పడ్డ కష్టం, డెడికేషన్, ప్రజలకు సేవ చేయాలనే తపన హృదయాని హత్తుకునేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేసే క్రమంలో మీరు మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది .అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసిపి అభ్యర్థి శిల్ప రవి కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడంతో ఈయనపై భారీ స్థాయిలో ట్రోల్స్ జరిగాయి.

మెగా బ్రదర్ నాగబాబు సైతం మావాడైన పగవాడే అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన మైనటువంటి పోస్ట్ చేశారు. అయితే శిల్పా తనకు ప్రాణ స్నేహితుడు కావడంతో తనకు మద్దతు తెలిపానని తన స్నేహితులు ఏ రంగంలో ఉన్న వారికి నా సపోర్ట్ ఉంటుందని , నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అల్లు అర్జున్ కొట్టి పారేశారు. ఇక తాజాగా పవన్ గెలవడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలపగా ఇది కాస్త వైరల్ అవుతుంది.

Read More: ఆ హిట్ సినిమా వరకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోలేదా.. బయటపడిన బిగ్ సీక్రెట్?

ట్రెండింగ్ వార్తలు