హ్యాపీ బర్త్ డే బావ.. ఫియర్ ఫైర్ అంటూ ఎన్టీఆర్ కు స్పెషల్ విషెస్ చెప్పిన బన్నీ!

May 20, 2024

హ్యాపీ బర్త్ డే బావ.. ఫియర్ ఫైర్ అంటూ ఎన్టీఆర్ కు స్పెషల్ విషెస్ చెప్పిన బన్నీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు ఈ క్రమంలోనే తన సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే అదే విధంగా బాలీవుడ్ చిత్రం వార్ 2 లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమా కూడా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేశారు.

ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి తరుణంలో నిన్ననే దేవర సినిమా నుంచి ఫియర్ అనే పస్ట్ సింగల్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి. అంతేకాకుండా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా ఆగస్టు నుంచి షూటింగ్ పనులు జరుపుకుంటున్న విషయాన్ని అభిమానులకు తెలియజేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు అలాగే సినీ సెలబ్రిటీలందరూ కూడా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ సైతం ఎన్టీఆర్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే బావ అంటూ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి విడుదల చేసినటువంటి ఫియర్ సాంగ్ కూడా ఫైర్ లా ఉంది అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: అమెరికాలో అడుక్కుతింటున్నానని ట్రోల్ చేశారు… ఎమోషనల్ అయిన లయ!

ట్రెండింగ్ వార్తలు