సైకిల్ షాప్ లో పంచర్ వేసుకునేవాడు.. అంత మాట అన్నావ్ ఏంటి బన్నీ?

May 16, 2024

సైకిల్ షాప్ లో పంచర్ వేసుకునేవాడు.. అంత మాట అన్నావ్ ఏంటి బన్నీ?

మెగా అల్లు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ తరచు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఏపీ ఎన్నికల సందర్భంలో ఈ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయగా మెగా హీరోలందరూ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు..

ఇకపోతే అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా తన మద్దతు తెలియజేయడమే కాకుండా ఏకంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి తన స్నేహితుడు అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలలో పర్యటన కూడా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రమంలోనే నాగబాబు మావాడైన ప్రత్యర్థులకు సాయంగా నిలిస్తే పరాయి వాడే అంటూ ఒక పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా ఈ పోస్ట్ అల్లు అర్జున్ అర్జున్ ని ఉద్దేశించి చేశారంటూ బన్నీ అభిమానులు భారీ స్థాయిలో మెగా హీరోలపై కామెంట్లు చేస్తున్నారు అయితే తాజాగా అల్లు అర్జున్ ట్విట్టర్ నుంచి ఒక షాకింగ్ పోస్ట్ వెలుగులోకి వచ్చింది.

ఈ పోస్ట్ చూస్తే కనుక నిజంగానే అల్లు అర్జున్ ఇలాంటి పోస్ట్ చేశారా లేదంటే ఈయన ట్విట్టర్ హ్యాక్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆ పోస్ట్ అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ లో లేకపోయినా అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే ఈరోజు నాగబాబు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ఎదురుగా సైకిల్ షాప్ లో పంచర్ వేసుకునే వాడు అంటూ ఉండటంతో ఈ పోస్ట్ కాస్త సంచలనంగా మారింది.

ఇలా ఈ పోస్ట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు మెగా అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే కారణం ఏదైనా మరోసారి మెగా వర్సెస్ అల్లు అనేలా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తుందని చెప్పాలి.

Read More: ఓటు హక్కు లేకపోయినా పవన్ భార్యతో రావడం వెనుక ఇంత పెద్ద కారణముందా?

Related News

ట్రెండింగ్ వార్తలు