June 15, 2024
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా వెర్సెస్ అల్లు అనే విధంగా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి వివాదాలు గురించి ఇరువురి కుటుంబ సభ్యులు మాట్లాడకపోయినా ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా తన స్నేహితుడికి ఎన్నికల సమయంలో మద్దతు తెలియపడమే ఈ వివాదాలకు కారణమని చెప్పాలి.
ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమాలపై పెద్ద దెబ్బ పడుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.
ఈ సందర్భంగా గీతాకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో వైరం అల్లు అర్జున్ సినిమాలకు మంచిది కాదని ఇప్పటికైనా మించి పోయింది లేదు. మెగా కుటుంబంతో సంధి చేసుకుంటే ఆయనకే మంచిదని తెలియజేశారు.. అల్లు అరవింద్ చిరంజీవి అనే ఓ బంగారు బాతును పట్టుకొని ఆయన పెట్టే గుడ్ల ద్వారా స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు. ఇక అల్లు అర్జున్ కూడా పథకం ప్రకారం సినిమాలు చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ అయ్యారు.
మొదటినుంచి కూడా అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ చులకనగానే చూశారు. రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ ఒక గేమ్ ఛేంజర్ అవుతారని ఊహించలేదు. ఇలా పవన్ కళ్యాణ్ తో విభేదాలు అల్లు అర్జున్ సినీ కెరియర్ పై ప్రభావం చూపుతాయని అందుకే వారితో సఖ్యత మంచిది అంటూ గీతా కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మరి నిజంగానే అల్లు అర్జున్ ఈ విషయంలో వెనుకడుగు వేసే మెగా కుటుంబంతో సఖ్యతగా ఉంటారా లేదంటే తన నటనపై నమ్మకంతో అలాగే దూసుకుపోతారా అనేది తెలియాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ఈ విషయాల గురించి అల్లు అర్జున్ ఎక్కడ కూడా స్పందించకపోవడం గమనార్హం.
Read More: సక్సెస్ కోసం పేరు మార్చుకుంటున్న రౌడీ హీరో!