పుష్ప రాజ్ స్టైల్లో అల్లు అయాన్.. తండ్రిని డిటో దించేశాడుగా?

March 5, 2024

పుష్ప రాజ్ స్టైల్లో అల్లు అయాన్.. తండ్రిని డిటో దించేశాడుగా?

సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు తమ వారసులుగా తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయటం సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పటికే ఎంతోమంది సినీ వారసులు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం యంగ్ హీరోలుగా ఉన్నటువంటి హీరోలు కూడా తమ పిల్లలను ఇంత చిన్న వయసు నుంచి అభిమానులకు పరిచయం చేస్తూ వారికంటూ ఒక గుర్తింపు తీసుకురావడం కోసం తెగ తాపత్రయపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పలువురు స్టార్ హీరోల పిల్లలకు ఇప్పటికే సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి వారిలో అల్లు అర్జున్ పిల్లలు అలాగే మహేష్ బాబు కుమార్తె సితార ఒకరని చెప్పాలి. మహేష్ బాబు కుమార్తె సితార ఇంత చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా ఒక్కో ప్రమోషన్ కి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఈ విధంగా సితారకు ఇంత చిన్న వయసులోనే భారీ ఫాలోయింగ్ ఉందని ఈమె హీరోయిన్గా వస్తే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం పక్క అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ పిల్లలు అర్హ ఇప్పటికే బాల నటిగాnఒక సినిమాలో నటించారు. అంతేకాకుండా ఈమె తనలో ఉన్నటువంటి టాలెంటును తన తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక అల్లు అర్జున్ కుమారుడు అల్లుఅర్జున్ కూడా ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అవుతున్నారు. ఈయన చేసే అల్లరి పనులు చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అయాన్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే తాజాగా అల్లు అయాన్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈయన తన తండ్రిని ఇమిటేట్ చేస్తూ కనిపించారు.

అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఏ విధంగా అయితే ఒక చేతిని పైకి పెట్టుకొని నడుస్తూ వస్తారో అయాన్ కూడా అదే విధంగా ఒక చేతిని పైకి లేపి గూని ఉన్నటువంటి వ్యక్తి లాగా నడుస్తూ వచ్చారు. ఇలా తన తండ్రిని ఇమిటేట్ చేయడంతో ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి నెటిజన్స్ ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read More: ఆ ఒక్క విషయంలో నేను నాగార్జున గొడవ పడతాము.. అమల కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు