ఆరు బయట నులక మంచం పై సేద తీరుతున్న అల్లు కిడ్స్.. ఫోటోలు వైరల్!

March 6, 2024

ఆరు బయట నులక మంచం పై సేద తీరుతున్న అల్లు కిడ్స్.. ఫోటోలు వైరల్!

సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా అల్లు అర్జున్ ఎంతో మంచి గుర్తింపు పొందగా ఆయన సతీమణి స్నేహ రెడ్డి కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తరచు తనకు సంబంధించిన తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంతో ఈమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇలా తరుచు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే స్నేహారెడ్డి తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే తన పిల్లలు ఇద్దరు ఆరు బయట నులక మంచం పై పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అసలే ఎండా కాలం మొదలైంది. ఇంట్లో ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాము.

ఈ క్రమంలోనే సాయంత్రం అలా ఆరు బయట మంచం వేసుకుని చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ క్రమంలోనే అల్లు స్నేహ రెడ్డి పిల్లలు అయాన్ అర్హ ఇద్దరూ కూడా మంచంపై పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఆ ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇటీవల కాలంలో అయాన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయాన్ ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ మోడల్ బోల్తే అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అదేవిధంగా ఈయన షారుఖ్ ఖాన్ సినిమాలోని పాటను హమ్ చేస్తూ పాడారు. ఇలా తన చిలిపి అల్లరి పనులతో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ కనిపిస్తున్నారు.

Read More: కోట్లలో డబ్బులు ఇచ్చి పెళ్లిళ్లకు పిలుస్తున్నారు.. తీవ్ర దుమారం రేపుతున్న నాగార్జున కామెంట్స్?

ట్రెండింగ్ వార్తలు