అయాన్ క్రేజ్ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది.. అల్లు శిరీష్ కామెంట్స్ వైరల్!

June 28, 2024

అయాన్ క్రేజ్ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది.. అల్లు శిరీష్ కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అల్లు రామలింగయ్య నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన వారసుడుగా అల్లు అరవింద్ నిర్మాతగా మారిపోయారు. ఇక ప్రస్తుతం అల్లు అరవింద్ వారసులుగా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అలాగే అల్లు శిరీష్ కూడా హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ శిరీష్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సక్సెస్ అవ్వడం కోసం ఎంతో కష్టపడుతున్నారు.

ఇకపోతే త్వరలోనే శిరీష్ బడ్డీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు శిరీష్ అయాన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ మాట్లాడుతూ ఉండగా అక్కడికి వచ్చిన అభిమానులు అయాన్ అంటూ గట్టిగా అరిచారు.

ఇలా అభిమానులందరూ అయాన్ గురించి అడగడంతో తనని తప్పకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకు వస్తానని ప్రామిస్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో అల్లు ఫాన్స్ మొత్తం గట్టిగా అయాన్ అంటూ కేకలు వేస్తూ ఉండగా శిరీష్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే అయాన్ కి ఉన్న క్రేజ్ చూస్తుంటే నాకు మెంటలెక్కిపోతుంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో అయాన్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అల్లు కుటుంబం నుంచి ఏదైనా ఫోటోలు బయటకు వచ్చాయి అంటే అందరూ తప్పనిసరిగా అయాన్ గురించే వెతుకుతారు. అయాన్ చేసే చిలిపి పనులు అందరికీ సరదాగా ఉంటాయి అంతేకాకుండా మీమర్స్ పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అయాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయిందని చెప్పాలి.

READ MOREAllu Sirish: వాళ్లేమో అలా..నేనేమో ఇలా..ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్

ట్రెండింగ్ వార్తలు