పవన్ కంటే నేనే డాన్స్ బాగా చేశాను.. అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్?

April 3, 2024

పవన్ కంటే నేనే డాన్స్ బాగా చేశాను.. అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్?

ఏపీ మంత్రి అంబంటి రాంబాబు తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు ఈయన ఎక్కువగా తన పార్టీలో జరిగే మేలు కంటే ఇతర పార్టీ వాళ్లు తమ పార్టీ పట్ల చేసే విమర్శల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా పండుగ వచ్చిందంటే తన నియోజకవర్గ ప్రజలతో కలిసి డాన్సులు చేస్తూ పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.

ఈ విధంగా అంబంటి రాంబాబు పండగలకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇలా ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు రోడ్డుపై డాన్సులు వేయడంతో చాలామంది ఈయన పట్ల విమర్శలు చేశారు. అయితే తన పట్ల విమర్శలు చేసిన వారి గురించి ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.

పండగ పూట నా నియోజకవర్గ ప్రజలతో కలిసి సరదాగా డాన్సులు వేసుకుంటూ పండుగను జరుపుకుంటే తప్పేంటి అని ఈయన విమర్శించిన వారికి సూటిగా ప్రశ్నించారు. ఇక ఈ డాన్స్ వీడియోలు బాగా వైరల్ గా మారడంతో ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే నాకు ఫోన్ చేసి నా డాన్స్ బాగుందని చెప్పారంటూ అంబటి రాంబాబు తెలిపారు.

నువ్వు డాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తున్నావని పవన్ కళ్యాణ్ కూడా నీలాగా డాన్స్ చేయలేదని తెలిపారు. చిరంజీవి తర్వాత అంత అద్భుతంగా డాన్స్ చేసే టాలెంట్ నీలోనే ఉంది అంటూ చాలామంది సినీ సెలబ్రిటీలే తన డాన్స్ పై ప్రశంసల కురిపించారు. ఇలా పవన్ కళ్యాణ్ కంటే నేనే బాగా డాన్స్ చేశానంటూ వారందరూ తన డాన్స్ ను మెచ్చుకున్నారని ఈయన తెలిపారు.

ఈ విధంగా అంబంటి రాంబాబు డాన్స్ వేయడం గురించి అలాగే డాన్స్ వేసే విషయంలో పవన్ కంటే నేను బెటర్ అంటూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై ప్రతి ఒక్కరు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అలాగే ఆయన అభిమానుల స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Read More: నడిరోడ్డు పై బూతులు మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఆ బూతులు ఏంటంటూ ట్రోల్స !

Related News

ట్రెండింగ్ వార్తలు