నన్ను ట్రోల్ చేయొద్దు… ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్!

June 24, 2024

నన్ను ట్రోల్ చేయొద్దు… ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా మరొక మూడు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఈ సినిమా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభాస్ దీపిక నాగ్ అశ్విన్, అమితాబ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులందరికీ క్షమాపణలు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ లో భాగంగా ఈయన పాత్ర భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తుంది.

ఇకపోతే ఈ సినిమాలో అమితాబ్ ప్రభాస్ మధ్య యాక్షన్ సన్నీ వేషాలు కూడా ఉండబోతున్నాయని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా అమితాబ్ మాట్లాడుతూ తాను ఈ సినిమాలో ప్రభాస్ ని బాగా కొట్టాను అయితే ఈ సన్నివేశాలు చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు ఎవరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంతేకాకుండా నన్ను ట్రోల్ చేయొద్దు దయచేసి ప్రభాస్ ని కొట్టినందుకు నన్ను క్షమించండి అంటూ ముందు గానే క్షమాపణలు చెప్పారు.

ఈ విధంగా ప్రభాస్ అభిమానులకు అమితాబ్ క్షమాపణలు చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి ప్రభాస్ స్పందిస్తూ.. అయ్యో సర్ వారందరూ కూడా మీకూ అభిమానులే అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు చేరుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read More: జాకెట్ విప్పిన అనసూయ పై భారీ ట్రోల్స్… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రంగమ్మత్త?

ట్రెండింగ్ వార్తలు