April 4, 2024
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. తర్వాత బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో తన 16వ సినిమాకి కమిట్అయ్యారు రామ్ చరణ్. ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం బుజ్జి బాబు ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ దించేశాడు. కన్నడ నుంచి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నుంచి విలన్ గా సంజయ్ దత్ ని, హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ని ఇప్పటికే ఈ సినిమా కోసం దించేశాడు.
అయితే ఇప్పుడు ఈ టీంలో మరొక నట దిగ్గజాన్ని దింపుతున్నాడు బుచ్చిబాబు. అతను మరెవరో కాదు బిగ్ బి అమితాబచ్చన్. ఈ సినిమాలో బిగ్ బి రామ్ చరణ్ కి తాతగా కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని మేకర్స్ చెప్తున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ అని ప్రచారంలో ఉన్నప్పటికీ అది నిజం కాదని, తాత మనవడు కాన్సెప్ట్ అని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు.
తాత పాత్రకి బలమైన స్టార్ అవసరం కావడంతో అమితాబ్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బి చిరంజీవి ఇద్దరు మంచి స్నేహితులు. చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాలో అమితాబ్ ఆయనకు గురువు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పాత్రలో కనిపించింది కాసేపే అయినా ఆ ప్రభావం సినిమా మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతం అమితాబచ్చన్ ప్యాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడి లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వెట్టెయాన్ సినిమాలో కూడా అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈమధ్య సౌత్ ఫిలింస్ లో అమితాబ్ హవా పెరిగిందనే చెప్పాలి. భవిష్యత్తులో బిగ్ బి మరిన్ని సౌత్ ఇండియా సినిమాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు.
Read More: పెళ్లి చేసుకొని బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్… ఏమైందంటే?