గం గం గణేశా ట్రైలర్ రిలీజ్.. పంచ్ డైలాగులతో అదరగొట్టిన ఆనంద దేవరకొండ!

May 22, 2024

గం గం గణేశా ట్రైలర్ రిలీజ్.. పంచ్ డైలాగులతో అదరగొట్టిన ఆనంద దేవరకొండ!

బేబీ తో మంచి హిట్ ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు గం గం గణేశా తో మనం ముందుకి వస్తున్నాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.

ఉదయ్ శెట్టి దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ సినిమా లో ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఆనంద్ దేవరకొండ తనదైన లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆనంద్ దేవరకొండ పంచ్ డైలాగులతో ట్రైలర్ మొదలవుతుంది. అమ్మాయిలకు వలవిసిరుతూ అబద్ధాలు చెబుతూ నవ్విస్తున్నాడు. వినాయక చవితి చుట్టూ తిరిగే కధ ఇది. ఒక దొంగగా ఉన్న అతని జీవితం చివరికి ఎలా మలుపు తిరుగుతుందో ట్రైలర్ లో చూపించారు.

వెన్నెల కిషోర్,జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. బేబీ సినిమాలో ఎమోషనల్ పండించిన ఆనంద దేవరకొండ ఈ సినిమాలో కామెడీ యాంగిల్ ని చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా రుచి చూపించారు. అలాగే టీజర్ లో లిప్ లాక్ కూడా హైలైట్ అయింది. సో ఈ సినిమా కనుక హిట్ అందుకుంటే మాస్ ఇమేజ్ కూడా ఆనంద్ దేవరకొండ కి సొంతం అవుతుంది.

ట్రైలర్ అదిరిపోయింది కానీ క్రైమ్ కామెడీ జోనర్ ఆనంద్ కి కలిసొస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అసలే మే 31న భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి అయితే ట్రైలర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విడుదలైన ఈ ట్రైలర్ కూడా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.

Read More: ఆగస్టు లో ప్రారంభం కాబోతున్న ఎన్టీఆర్ కొత్త సినిమా.. వర్కింగ్ టైటిల్ “ఎన్టీఆర్ నీల్”!

ట్రెండింగ్ వార్తలు