పుష్ప రాజ్ టీ గ్లాస్ స్టెప్ పై అనసూయ కామెంట్స్.. ఏమన్నారంటే?

May 3, 2024

పుష్ప రాజ్ టీ గ్లాస్ స్టెప్ పై అనసూయ కామెంట్స్.. ఏమన్నారంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ సాగిపోయే ఈ పాట సోషల్ మీడియాని షేర్ చేస్తుంది ఇందులో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పటికే ఈ పాటకు ఎంతోమంది స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ ఈ పాటలో షూ ఊపుతూ ఫోన్ మాట్లాడుతూ వేసే స్టెప్పులు అలాగే టీ గ్లాస్ పట్టుకొని టీ కింద పడిపోకుండా వేసేసి చెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ పాటపై అల్లు అర్జున్ వేసిన స్టెప్పులపై ఇప్పటికే ఎంతోమంది ప్రశంసలు కూడా కురిపించారు. తాజాగా అనసూయ సైతం అల్లు అర్జున్ టీ గ్లాస్ స్టెప్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అనసూయ కూడా పుష్ప 2 సినిమాలో భాగమైన సంగతి మనకు తెలిసిందే. ఈమె దాక్షాయని అనే పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పుష్ప సినిమాలో ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ సీక్వెల్ చిత్రంలో మాత్రం ఈమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండబోతుందని తెలుస్తుంది.

ఇకపోతే టీ గ్లాస్ స్టెప్ గురించి అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నీ పేరే నీ బ్రాండు అని కామెంట్స్ చేసింది. అంతే కాదు టీ గ్లాస్ స్టెప్పు పై అనసూయ ప్రత్యేక ప్రశంసలు కురిపించింది. టీ గ్లాస్ స్టెప్పు చాలా కష్టం అని తెలిపారు. ఈ సాంగ్ కి 24 గంటల్లో 40 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Read More: అదిరిపోయిన నాగార్జున కుబేర ఫస్ట్ లుక్ .. కళ్ళజోడు గొడుగుతో సూపర్ లుక్!

ట్రెండింగ్ వార్తలు