పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్.. కాసేపట్లోనే వైరల్ అయిన వైనం!

May 16, 2024

పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్.. కాసేపట్లోనే వైరల్ అయిన వైనం!

సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప2 ది రూల్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని చాలా వాయిదాల తర్వాత ఆగస్టు 15న విడుదల చేయడానికి సిద్ధపడ్డారు మూవీ మేకర్స్. గతంలో వచ్చిన పుష్ప మూవీ సౌత్ లోనూ నార్త్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసి భారీ కలెక్షన్స్ రాబట్టడంతో పుష్ప టు సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు వస్తున్న మూవీ అప్డేట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇప్పటికే పుష్ప, పుష్ప అంటూ సాగే పాటతో అల్లు అర్జున్ యూత్ ని ఒక ఊపు ఊపేసాడు. అందులో అతని హుక్ స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ ఆ సాంగ్ కి రీల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు నెటిజన్స్. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి మరొక కొత్త అప్డేట్ వచ్చింది.

బుధవారం అనసూయ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్లో ఆమె చాలా గంభీరంగా కనిపిస్తుంది ఆమె పోజ్ చూస్తుంటే ఎవరినో ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. అనసూయ ఈ సినిమాలో దాక్షాయినిగా కనిపించబోతుంది. పుష్ప పార్ట్ వన్ లో దాక్షయని గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన అనసూయ తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది.

ఇక ప్రస్తుతం విడుదల చేసిన అనసూయ పోస్టర్ ని చూసిన ప్రేక్షకులు పుష్ప2 లో అంతకుమించి మాస్ అపీరియన్స్ ఇవ్వబోతుందని ఊహగానాలుచేస్తున్నారు. ఈ పోస్టర్ విడుదల అయిన కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఇక దాక్షాయణి పుష్ప మీద పగ సాధిస్తుందా, ఆమె భర్త మంగళం శీను ఏమయ్యాడు లాంటివి తెలియాలంటే మూవీ రిలీజ్ అయిన వరకు వెయిట్ చేయాల్సిందే.

Read More: డబుల్ ఇస్మార్ట్ దిమాకికిరికిరి టీజర్

ట్రెండింగ్ వార్తలు