Anasuya: పవన్ సినిమాలో అనసూయ..ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన‌ నటి?

July 11, 2024

Anasuya: పవన్ సినిమాలో అనసూయ..ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన‌ నటి?

Anasuya Bharadwaj: జబర్దస్త్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి అనసూయ. యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా చేస్తూనే సినిమాలు కూడా చేశారు కానీ తనకు సమయం లేకపోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి పూర్తిగా గుడ్ బై చెప్పారు. ఇలా బుల్లితెరకు దూరంగా ఉన్న ఈమె వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.

ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న అనసూయకు సినిమా అవకాశాలు తగ్గాయా లేకపోతే బుల్లితెరపై అవకాశాలు మంచిగా వస్తున్నాయో తెలియదు కానీ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె ఈటీవీలో కాకుండా స్టార్ మా లో ప్రసారమయ్యే కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

ఇక కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేశారు. అయితే పలువురు నెటిజన్స్ వివిధ రకాల ప్రశ్నలు వేయగా ఒక నెటిజన్ మాత్రం మీరు పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు నటిస్తారు అనే ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను పవన్ కళ్యాణ్ తో ఆల్రెడీ ఒక సినిమాలో నటించానని అయితే అది చిన్న పాత్రని ఈమె తెలియజేశారు త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ కూడా అనసూయ ఈ సందర్భంగా క్లారిటీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఏ సినిమాలో ఈమె నటిస్తున్నారనే విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం మూడు సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే ఈయన రాష్ట్ర రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి తనకు వీలైనప్పుడు సినిమాలను పూర్తి చేస్తానని వెల్లడించారు

Related News

ట్రెండింగ్ వార్తలు