April 6, 2024
బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అనసూయ ఇటీవల రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు..
తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలు అలాగే తన వర్కౌట్స్ కి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలను కూడా ఈమె అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే అనసూయ ఇటీవల జిమ్ లో భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ కనిపించారు. పొట్టి టీషర్ట్ నిక్కర్ ధరించి ఈమె పెద్ద ఎత్తున బరువులు ఎత్తుతూ తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి శాయాశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి నోట్ రాసుకోవచ్చారు తాను ఇలా అందంగా ఆరోగ్యంగా కనిపించాలన్న ప్రశాంతంగా ఉండాలన్న ఇలా వర్కౌట్ చేయాల్సిందే అంటూ ఈ వీడియోని షేర్ చేసారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ యథావిధిగా ఈమె పట్ల కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆంటీ అంటూ ఈమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి వర్కౌట్ చేయడం అవసరమా ఆంటీ ఎక్కడైనా పట్టుకుపోయేను అంటూ కొందరు ఈమెను ఆంటీ అని ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారు. అలాగే మరికొందరు తినడం ఎందుకు వర్క్ అవుట్ లు చేయడం ఎందుకు అంటూ కామెంట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More: కొత్త బిజినెస్ ప్రారంభించిన బిగ్ బాస్ టేస్టీ తేజ.. సక్సెస్ అయ్యేనా?