June 10, 2024
అనసూయ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఇండస్ట్రీలోకి న్యూస్ రీడర్ గా అడుగుపెట్టి అనంతరం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలపాటు ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ఈమె అనంతరం సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపైకి వెళ్లారు.
ఇలా వెండితెర నటిగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న అనసూయ పూర్తిగా బుల్లితెరకు దూరంగా ఉన్నారు. అయితే తిరిగి ఈమె బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తాజాగా ఒక వార్త వైరల్ అయింది ఇన్ని రోజులు ఈటీవీలో యాంకర్ గా వ్యవహరించిన ఈమె ప్రస్తుతం స్టార్ మా యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది.
స్టార్ మా లో త్వరలోనే సరికొత్త కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` పేరుతో షో చేస్తుంది. ఇది టీనేజ్ కుర్రాళ్ల షో. దీనికి అనసూయ హోస్ట్ చేస్తుంది. త్వరలోనే ఈ కొత్త షో ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు షూటింగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఆమె డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో మెరిసింది. ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ని ఇన్‌స్టా, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాలకు హాజరు కాబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం కాబోతుంది ఏంటి అనే విషయాలను త్వరలోనే వెల్లడించునున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె తిరిగి బుల్లితెర పైకి రావడంతో సినిమా అవకాశాలు తగ్గాయని, ఇటీవల కాలంలో అనసూయ ఎంతో స్వేచ్ఛగా తన కుటుంబంతో గడుపుతున్నారు ఇలా ఈమెకు సినిమా అవకాశాలు తగ్గడంతోనే బుల్లితెర కార్యక్రమాలకు కూడా కమిట్ అవుతున్నారని తెలుస్తోంది.
Read More: కల్కి ప్రీ రిలీజ్ గెస్ట్ గా పవన్ చంద్రబాబు… నిజమెంత?