జాకెట్ విప్పిన అనసూయ పై భారీ ట్రోల్స్… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రంగమ్మత్త?

June 24, 2024

జాకెట్ విప్పిన అనసూయ పై భారీ ట్రోల్స్… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రంగమ్మత్త?

అనసూయ బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె బుల్లితెరపై ఎంతో ఫేమస్ అయిన తర్వాత సినిమా అవకాశాలు రావడంతో పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దగ్గరవుతూ బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో తనకు సినిమా అవకాశాలు తగ్గాయో లేకపోతే బుల్లితెరపై ఆసక్తి పెరిగిందో తెలియదు కానీ తిరిగి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు.

వచ్చే శని వారం నుంచి స్టార్ మా లో కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే ఒక గేమ్ షో ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే గర్ల్స్ టీం లీడర్ గా అనసూయ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా అనసూయ శేఖర్ మాస్టర్ తో పోటీపడి జాకెట్ విప్పడంతో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అయితే ఈ ట్రోల్స్ పై ఈమె స్పందించారు.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ అనసూయను ఉద్దేశించి పోస్ట్ చేస్తూ..ఇది నిజంగా నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుందని పోస్ట్ పెట్టాడు. అనసూయ స్పందించింది. మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకు మీరు ఇంత రోగంతో బాధపడుతున్నారని అనిపిస్తోంది అంటూ సమాధానం ఇచ్చింది మరొక నెటిజన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ..

మీకు నిజంగా అర్థం కావట్లేదా అండి.. ఎలా ఉండే షోలు ఎలా అవుతున్నాయి. మీ పాత్ర మంచిగా ఉండాలి కానీ బ్యాడ్ వైపు వెళ్ళకూడదు. నటిగా మీరంటే ఇష్టం. కానీ ఇలాంటివి చేయకపోవడం మంచిది అని కామెంట్ చేశారు. ఈయనకి కూడా అనసూయ రిప్లై ఇస్తూ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులుగా మేము కొన్ని విషయాలని ఎక్స్ ప్లోర్ చేయాలి. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు తప్పవు. మీరంతా ఇలా బుల్లితెర మీదే ప్రతాపం చూపిస్తారు. సినిమాల్లో అభ్యంతర కరమైనవి ఎన్ని వస్తున్నా సినిమాలను హిట్ చేస్తున్నారు అసలు నేనేం చెప్తున్నాను మీకు అర్థం అవుతుందా అంటూ ఈమె ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Read More: ఆ ఒక్క కారణంతోనే నేను యాడ్స్ చేయడానికి దూరంగా ఉంటాను.. పవన్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు