Anasuya Bharadwaj: క్షమాపణలు చెప్పిన అనసూయ.. ఏమైందంటే?

June 14, 2024

Anasuya Bharadwaj: క్షమాపణలు చెప్పిన అనసూయ.. ఏమైందంటే?

అనసూయ పరిచయం అవసరం లేని పేరు. ఈమె కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేశారు. అనంతరం యాంకర్ గా పలు కార్యక్రమాలకు పని చేశారు. కానీ జబర్దస్త్ మాత్రం ఈమెకు పేరు ప్రఖ్యాతలు తీసుకోవచ్చింది. జబర్దస్త్ యాంకర్ గా కొనసాగిన అనసూయ ఈ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకొని ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇలా వెండితెర సినిమా అవకాశాలు అందుకొని వరుస సినిమాలలో నటిస్తున్న ఈమెకు రంగస్థలం సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వెండితెరపై కూడా వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పై ఫోకస్ పెట్టిన ఈమె తిరిగి బుల్లితెరకు కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అంతేకాకుండా తనని వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేసి ట్రోల్ చేసిన వారికి తన స్టైల్ లోనే సమాధానం చెబుతూ ఉంటారు.

ఇలా తనపట్ల ఎన్ని ట్రోల్స్ వచ్చినా తగ్గేదే లేదంటూ ఈమె తనకు నచ్చిన విషయాలను ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు. ఇలా ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ వెనకడుగు వేయని ఈమె మొదటిసారి క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు అనసూయ క్షమాపణలు చెప్పడమేంటి ఏం జరిగింది అనే విషయానికి వస్తే..అనసూయ గత కొద్దిరోజులుగా తన పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాకు దూరమయ్యారు. ఇలా సోషల్ మీడియాకు దూరం కావడంతో అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఈమె పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Read MoreGlam Pix: Anasuya Bharadwaj

ట్రెండింగ్ వార్తలు