భర్తతో కలిసి కొండకోనల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న యాంకరమ్మ!

May 18, 2024

భర్తతో కలిసి కొండకోనల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న యాంకరమ్మ!

సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈమె యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లినట్టు తెలుస్తుంది.

వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికినా కూడా ఈమె తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ తన విలువైన సమయాన్ని వారికి కేటాయిస్తూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి అనసూయ తన భర్త పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లారని తెలుస్తుంది.

ఇలా తన భర్త పిల్లలతో కలిసి కొండ కోనల్లోనూ వాగు వంకల చుట్టూ తిరుగుతూ ఈమె ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక తాజాగా తన భర్తతో అనసూయ ఉన్నటువంటి రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.

ఇక ఇటీవల అనసూయ తన పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తన పుట్టినరోజు వేడుకలను సైతం తన భర్త పిల్లలతో కలిసి జరుపుకున్నారు. ఇక తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక అనసూయ పుట్టినరోజు సందర్భంగా ఈమె నటిస్తున్నటువంటి పుష్ప 2 సినిమా నుంచి దాక్షాయిని పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Read More: కన్నప్పలో స్టార్ హీరోయిన్ కాజల్.. ఇంకా ఎంతమందిని దించుతావు బాసు?

ట్రెండింగ్ వార్తలు