చెప్పు తీసుకొని కొడతా.. జబర్దస్త్ కమెడియన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ?

June 20, 2024

చెప్పు తీసుకొని కొడతా.. జబర్దస్త్ కమెడియన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ?

బుల్లితెర కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇలా బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారమవుతుంది. గురువారం జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం కాగా శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఇక ఈ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇలా ప్రతివారం ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ రష్మి కమెడియన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ విధంగా రష్మీ కమెడియన్ పట్ల అంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే కమెడియన్ నూకరాజు గురించి పరిచయం అవసరం లేదు. ఇక స్కిట్ లో భాగంగా ఈయన రష్మీ ను ముద్దుగా రశ్మిని అని పిలుస్తూ ఆట పట్టించారు దీంతో రష్మీ స్కిట్ లో ఏదైనా కామెడీ చేసేది ఉందా లేదా అంటూ పంచ్ వేసింది. ఈ విధంగా రష్మీ రెండు మూడు సార్లు అడిగినప్పటికీ ఆయన వినపడనట్టు నటించాడు.

ఈ విధంగా రష్మీ పిలిచిన పలకకపోవడంతో వెంటనే నీకు ఒక ముద్దు పెడతాను రా అంటూ రష్మీ పిలవగా వెంటనే నూకరాజు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలా పరిగెత్తు వెళ్లడంతో రష్మీ చెప్పు తీసి కొడతా అంటూ మాట్లాడారు. అయితే ఇదంతా సరదాగా జరిగిన సంభాషణ అయినప్పటికీ నిర్వాహకులు ప్రోమో కోసం దీనిని హైలెట్ చేస్తూ చూపించడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

Read More: బేబీ బంప్ తో దీపికా… ప్రభాస్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

ట్రెండింగ్ వార్తలు