ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు… సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇబ్బంది పెడుతున్నాయి: యాంకర్ శ్యామల

June 7, 2024

ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు… సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇబ్బంది పెడుతున్నాయి: యాంకర్ శ్యామల

గత ఎన్నికలలో భాగంగా ఎంతో మంది సినిమా సెలబ్రిటీలో రాజకీయ పార్టీలకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన పార్టీ తరఫున ఎంతో మంది సీరియల్ ఆర్టిస్టులు సినిమా సెలబ్రిటీలు అలాగే జబర్దస్త్ కమెడియన్లు కూడా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున యాంకర్ శ్యామల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగానే ఈమె రాజకీయంగా తన ప్రత్యర్థులపై చేసినటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఘోరంగా ఓటమి ఎదుర్కొని కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా యాంకర్ శ్యామలపై భారీ స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు టిడిపి నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా ఈమెను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై శ్యామల స్పందించారు. సోషల్ మీడియాలో తనని బాగా ట్రోల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అలాగే బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయని శ్యామల తెలిపారు. అయితే వీటన్నింటికి నేను భయపడనని వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు.

నేను ఒక అభిమానిగా నాకు నచ్చిన పార్టీ తరపున ప్రచారం చేశాను అయితే నేను రాజకీయాల పరంగా మాత్రమే ప్రచారం చేశారని తప్ప ఎవరి వ్యక్తిగత విషయాలను దూషిస్తూ ప్రచారం చేయలేదని తెలిపారు. ఎవరి అభిమానం వారిదని, నాకు పార్టీ ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించానని తెలిపారు. ఎవరు ఎన్ని ట్రోల్ చేసిన నేను జగనన్న వెంటే నడుస్తానని ఇలాంటి ట్రోల్స్ గురించి తను అస్సలు పట్టించుకోనని ఈమె వెల్లడించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలవాలని కోరుతూ ఈమె శుభాకాంక్షలు తెలిపారు.

Read More: ఆ పాట చేయొద్దని ఒత్తిడి తెచ్చారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

ట్రెండింగ్ వార్తలు