May 3, 2024
మరొక పది రోజులలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే ఈ అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. మరో వారం రోజులపాటు ప్రచారం చేయడానికి మాత్రమే అనుమతి ఉండటంతో పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలలోకి వెళ్తున్నారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయమంత ఒకవైపు అయితే పిఠాపురం రాజకీయం మాత్రమే ఒకవైపు ఉందని చెప్పాలి ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రస్తుత కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతాకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే బరిలో నిలబెట్టారు మరోవైపు ఈమెకు పోటీగా కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల పరిధిలోకి రాబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు మెగా హీరోలందరూ అలాగే జబర్దస్త్ టీం మొత్తం పిఠాపురంలోనే ఉన్నారు.
ఇలా పిఠాపురంలో వీరంతా కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నటి యాంకర్ శ్యామల తాజాగా పిఠాపురంలో గెలుపు ఎవరిది అనే విషయం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ గెలుపు ఖాయమైందని తెలిపారు.
వంగ గీత చాలా సీనియర్ నాయకురాలు ఆమెను ఓడించడం ఎవరివల్ల కాదు. ఇక ఆమె ఈ నియోజకవర్గాన్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకు వచ్చారో మనకు తెలిసిందే. అందుకే ప్రజలందరూ కూడా ఆమెకే మద్దతు తెలుపుతున్నారు. ఎవరైతే అభివృద్ధి చేసుంటారో వారికే ఓటు వేయాలని అందుకే ఆమె తరపున నేను కూడా ప్రచారం చేస్తున్నానని వెల్లడించారు.
పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసిన వారికే ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి వంగా గీతా తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈమె తెలిపారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అంత పెద్ద స్టార్ హీరో గెలుపు ఖాయమని భావించిన ఆయన ఎందుకు అంత మంది జబర్దస్త్ వాళ్లను రంగంలోకి దింపారు అంటూ ప్రశ్నించారు. ఇలా పవన్ కళ్యాణ్ గెలుపు చాలా కష్టమని పిఠాపురంలో వంగా గీత తప్పకుండా గెలుస్తుంది అంటూ ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: తండ్రి చిరంజీవి కోసం సింగర్ గా మారిన రామ్ చరణ్.. ఏమైందంటే?