రేవ్ పార్టీలో నేను లేను.. నన్ను లాగొద్దంటున్న యాంకర్

May 23, 2024

రేవ్ పార్టీలో నేను లేను.. నన్ను లాగొద్దంటున్న యాంకర్

బెంగళూరు రేవ్ పార్టీలో ఒక్కొక్కరి పేర్లు బయటకొస్తున్నారు. తెలుగులో చాలా మంది నటీ నటులు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి నటి హేమ ఈ పార్టీకి హాజరైన వార్తలు ఇండస్ట్రీలని షేక్ చేస్తున్నాయి. తాను హాజరుకాలేదని నమ్మించడానికి హేమ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఆమె పార్టీకి హాజరైన ఫోటోలను పోలీసులు బయట పెట్టారు. దీంతో.. ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ పార్టీలో హాజరయ్యారని నటి, యాంకర్ శ్యామల పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. రేవ్ పార్టీలో శ్యామల రచ్చ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు పార్టీ ఎప్పుడు జరిగిందో? ఎక్కడ జరిగిందో? అక్కడ ఎవరెవరు ఉన్నారో తనకు తెలియదని శ్యామల అన్నారు. ఆ పార్టీలో తాను ఉన్నానని కొంతమంది చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆమె చెప్పారు. తనపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఆమె చెప్పారు.

మొన్నటి ఎన్నికల్లో ఒకపార్టీ కోసం పని చేశాననే తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసత్య ప్రచారాన్ని చేసేవాళ్లను వదిలేదే లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. వాళ్ల మీద పరువు నష్టం దావా వేస్తారనని తెలిపారు.

Read More: ఎన్టీఆర్ అభిమానులను హెచ్చరించిన నందమూరి చైతన్య.. ఇదే నా వార్నింగ్ అంటూ!

Related News

ట్రెండింగ్ వార్తలు