పెళ్లి పీటలు ఎక్కబోతున్న మ‌రో మెగా హీరో?

June 14, 2024

పెళ్లి పీటలు ఎక్కబోతున్న మ‌రో మెగా హీరో?

ఇటీవల కాలంలో మెగా కుటుంబానికి అన్ని మంచే జరుగుతున్నాయి. మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో గుడ్ న్యూస్ వింటూ ఉన్నారు. మెగా వారసుడు రామ్ చరణ్ గత ఏడాది తండ్రిగా ప్రమోట్ అయ్యారు. ఉపాసన రాంచరణ్ దంపతులు తల్లితండ్రులుగా మారడమే కాకుండా తమ చిన్నారి ఇంట్లోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈ సమాజంలో మరింత పేరు ప్రతిష్టలను సొంతం చేసుకుంటున్నారు.

క్లీన్ కారా కడుపులో ఉండగానే రామ్ చరణ్ నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం, ఇక రామ్ చ‌ర‌ణ్‌ గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ చిన్నారి జన్మించిన తర్వాత తన బాబాయ్ వరుణ్ తేజ్ వివాహపు వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఇక తన తాతయ్య చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇలా క్లీన్ కార రాక మెగా కుటుంబానికి అన్ని సంతోషాలని తీసుకువచ్చిందనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలలో భారీ విజయం సాధించి మంత్రిగా పద‌వీ స్వీకారం చేశారు.

ఇకపోతే మెగా కుటుంబ సభ్యులు త్వ‌ర‌లో మరో శుభవార్తను తెలియజేయబోతున్నారు. గత కొద్దిరోజులుగా మెగా మేనల్లుడు సాయి ధుర్గా తేజ్ వివాహం గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే తేజ్‌ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో తమ కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయం చేశారని త్వరలోనే నిశ్చితార్థం జరగబోతుందని సమాచారం.

ఇలా నిశ్చితార్థం జరిగిన కొద్ది నెలలకి వీరిద్దరి వివాహం జరగబోతుందని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read MoreMaharaja Telugu Review: విజ‌య్ సేతుప‌తి మ‌హారాజ ఎలా ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు