April 13, 2022
రామ్ చరణ్ మగధీర సినిమాలో ఒక పాటలో కనిపించాడు చిరంజీవి. ఆ తర్వాత చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాలో రామ్ చరణ్ కుడా ఒక పాటలో కనిపించాడు. అయితే అవి గెస్ట్ రోల్స్ మాత్రమే..వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో నిన్న విడుదలైన ట్రైలర్ యాక్షన్ మరియు ఎమోషనల్ అంశాలతో సాగింది. ఈ ట్రైలర్ ఇప్పటికే 20 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించింది. అయితే ఈ ట్రైలర్ ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ తోనే ప్యాక్ చేయడం కొంత మంది అభిమానులకి నచ్చడంలేదట. ఎలాగు రిలీజ్‌కి చాలా సమయం ఉండడంతో ఈ సినిమా నుండి మరో ట్రైలర్ కూడా రెడీ చేశారట మేకర్స్. అయితే ఫస్ట్ ట్రైలర్ ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో ఉండగా ఈ సారి ట్రైలర్ మాత్రం మంచి ఎమోషనల్ గా ఉంటుందట. ఇది సినిమా రిలీజ్ కి కాస్త ముందు రావచ్చని టాక్. సో అప్పటి వరకు వేచి ఉండాలి.
Read more: బీస్ట్ సినిమా నచ్చలేదని థియేటర్‌కి నిప్పంటించిన అభిమానులు