రామ్ చరణ్ నో.. ఎన్టీఆర్ అయితే ఓకే అంటున్న అనుష్క?

June 6, 2024

రామ్ చరణ్ నో.. ఎన్టీఆర్ అయితే ఓకే అంటున్న అనుష్క?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో ఎన్టీఆర్ ఒకరు ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అంటే ఎవరైనా ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలా ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి వారిలో నటి అనుష్క శెట్టి కూడా ఒకరిని చెప్పాలి. అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఈమె కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి హీరోల సరసన నటించిన ఈమె ఇప్పటివరకు ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశాన్ని మాత్రం అందుకోలేకపోయారు..

ఇలా ఎన్టీఆర్ అనుష్క కాంబినేషన్ లో సినిమాలు చేయాలని ప్రయత్నించిన ఈ కాంబినేషన్ సెట్ కాకపోవడంతో ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరపైకి రాలేదు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనుష్క మాత్రం తన మనసులో కోరికను బయటపెట్టారు. ఈమెకు ఎన్టీఆర్ తో నటించాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు.

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అనుష్కను ప్రశ్నిస్తూ మీకు కనుక ఒకేసారి ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి నటించే అవకాశాలు వస్తే మీరు ఎవరితో నటిస్తారు అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు అనుష్క ఏ మాత్రం తడబడకుండా ఎన్టీఆర్ తో అంటూ సమాధానం చెప్పారు. ఇలా రామ్ చరణ్ తో నటించాలనే ఆసక్తి లేకపోయినా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుష్క ఎంతో గాను ఎదురుచూస్తుందని అయితే ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదని తెలుస్తుంది. మరి ఇప్పుడైనా వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది.

Read More: రాజమౌళి, మహేష్ మూవీకి ఐడియా ఇచ్చింది అతనేనా.. ఏకంగా జక్కన్నకే సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? 

ట్రెండింగ్ వార్తలు