ఆ విషయంలో తరచూ గొడవ పడుతున్న బన్నీ, స్నేహ.. అసలేం జరుగుతుంది?

March 26, 2024

ఆ విషయంలో తరచూ గొడవ పడుతున్న బన్నీ, స్నేహ.. అసలేం జరుగుతుంది?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు అల్లు అర్జున్ కెరియర్ పరంగా ఎంతో బిజీ ఉండడమే కాకుండా స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేనటువంటి అమ్మాయి అయినా స్నేహారెడ్డిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ ఎవరితోనైనా సరదాగా మాట్లాడుతూ కలిసిపోతూ ఉంటారు కానీ స్నేహ రెడ్డి మాత్రం చాలా సైలెంట్ ఈమె మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయనే చెప్పాలి. ఇలా ఎంతో సైలెంట్ గా ఉండే స్నేహ రెడ్డి ఒక విషయంలో మాత్రం తరచూ అల్లు అర్జున్ తో గొడవ పడుతూ ఉంటుందని వీరిద్దరి మధ్య ఈ ఒక్క విషయం గురించి గొడవ జరుగుతుందని తెలుస్తోంది. మరి వీరిద్దరి మధ్య జరిగే ఆ గొడవ ఏంటి అనే విషయానికి వస్తే..

అల్లు అర్జున్ స్నేహ రెడ్డి పిల్లల విషయంలోనే గొడవ పడుతూ ఉంటారని తెలుస్తుంది.స్నేహ రెడ్డి పిల్లలకు కష్టం విలువ తెలియకుండా పెంచడం ఇష్టం లేదు అందుకే వారు పడుతూ లేస్తూ ఉంటే వారికి కష్టం విలువ తెలుస్తుందని అప్పుడే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగలరని ఈమె చెబుతూ తన పిల్లలకు అవసరమైనటువంటి వాటిని ముందుగా సమకూర్చడానికి ఏమాత్రం ఇష్టపడరట కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు.

తన పిల్లలకు ఎలాంటి కష్టం తెలియకుండా వారిని చాలా ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటారట. అందుకే వారికి ఏది ఎప్పుడు అవసరమో అనే విషయాలను తెలుసుకొని అల్లు అర్జున్ వారు అడగకనే ముందుగానే అన్ని తీసుకువచ్చి పిల్లల పట్ల గారాబం చేస్తూ ఉంటారట. ఈ విషయం నచ్చని స్నేహ రెడ్డి తరచూ ఇదే విషయం గురించి గొడవ పడుతూ ఉంటారని తెలుస్తుంది.

తల్లిగా స్నేహ రెడ్డి పిల్లలకు జీవితంలో ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలిన నిలబడేలా ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుండగా అల్లు అర్జున్ మాత్రం తండ్రిగా తన పిల్లలను ఎలాంటి కష్టం పడకూడదని ఆరాటపడుతున్నారు వీరిద్దరి ప్రేమ ఒకటే అయినప్పటికీ వీరు చూపే విధానం భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఈ విషయం గురించే గొడవ జరుగుతుందని తెలుస్తుంది.

Read More: రొమాన్స్ తో రెచ్చిపోతున్న ప్రముఖ డైరెక్టర్.. ఆ హీరోయిన్ తో వీడియో సాంగ్ విడుదల!!

ట్రెండింగ్ వార్తలు