నా బాడీ సూపర్ డీలక్స్.. అషు రెడ్డి కామెంట్స్ వైరల్!

May 3, 2024

నా బాడీ సూపర్ డీలక్స్.. అషు రెడ్డి కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి ఈ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట సోషల్ మీడియాలో డబ్బు స్మాష్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే జూనియర్ సమంతగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో యువత మతి పోగొడుతూ ఉంటుంది.

ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ని బోల్డ్ ఇంటర్వ్యూ చేసి బోల్డ్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలిచే అషు రెడ్డి రెడ్డి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇది ఇలా ఉంటే హీరోయిన్ చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, జై భారత్ ,అషురెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం యేవం. ఈ మూవీకి ప్రకాష్ దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వహించారు. కీర్తన శేషు సంగీతాన్ని అందిస్తోండ‌గా నవదీప్, గోపరాజులు నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల చాందిని చౌదరి ఫస్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి అషు రెడ్డి లుక్‌ను విడుద‌ల చేశారు.

ఈ సినిమాలో హారిక అనే పాత్ర‌లో అషు క‌నిపించ‌నుంది. పోస్ట‌ర్‌లో ఒక చైర్‌లో కాలుమీద కాలేసుకుని అషురెడ్డి కూర్చోంది. నా బాడీ సూపర్ డీలక్స్ అనే కాప్షన్ ను జోడించారు. చూస్తుంటూ ఈ మూవీలో అషు రెడ్డి బోల్డ్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ బోలెడుగా కామెంట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది.

Read More: ఆనంద్ దేవ‌ర‌కొండ గం.గం..గణేశా సెకండ్ సింగిల్ అప్‌డేట్ రిలీజ్.. ఈ సారి హిట్ గ్యారెంటీ అంటూ?

ట్రెండింగ్ వార్తలు