December 7, 2021
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవడంతో పాటు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది. ఆర్య, ఆర్య2 తర్వాత బన్ని-సుకుమార్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. టాలివుడ్ స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ పూర్తి మాస్ రోల్‌లో ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Read More: ‘బంగార్రాజు’ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘నా కోసం’ పాట విన్నారా?తాజాగా పుష్ప ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.. భూమండలంలో యేడా పెరుగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతుంది. ఈడ నుంచే వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంది. గోల్డ్ రా ఇది భూమిపై పెరిగే బంగారం..పేరు ఎర్రచందనం అంటూ అజయ్ ఘోష్ చెప్పే సంభాషణలతో మొదలైన ట్రైలర్ లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో సాగుతూ క్యూరియాసిటీని పెంచింది.
ట్రైలర్ లో బన్నీ నట విశ్వరూపం చూపించారు. మాస్ పాత్రలో ఇరగదీశాడు. ట్రైలర్ ఆసాంతం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఒకటి రెండు చోట్ల.. రష్మిక వెంట పడుతూ కనిపించాడు పుష్పరాజ్. ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్అనే డైలాగ్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుంది. ఈ సినిమాలో బన్ని రెండు పాత్రల్లో నటిస్తున్నట్లు హింట్ ఇచ్చారు దర్శకుడు సుకుమార్. రెండు పాత్రల్లో వేరియేషన్స్ క్లీయర్‌గా తెలుస్తున్నాయి. అలాగే చివర్లో పార్టి లేదా పుష్ప అని ఫహద్‌ఫాజిల్ చెప్పే డైలాగ్ వారిద్దరి మధ్య యుద్దం ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలిపింది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచింది.
ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి దాదాపు కోటి వ్యూస్‌కు దగ్గరైన పుష్ప ట్రైలర్‌ను మీరు చూసెయ్యండి: