బిగ్ బాస్ 8లో ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. ఇందులో నిజమెంత?

July 3, 2024

బిగ్ బాస్ 8లో ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. ఇందులో నిజమెంత?

Bigg Boss Telugu 8:బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలోనూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకుంది.

ఇక త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈసారి సెప్టెంబర్ లో కాకుండా ముందుగానే ఆగస్టులోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేశారని తెలుస్తుంది. మరోవైపు కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయినట్టు సమాచారం.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఇప్పటికే పలువురు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా మరొక కంటెంట్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలను నిలిచిన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అని తెలుస్తుంది.

ఈయన సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకుల జాతకాలని చెబుతూ వార్తల్లో నిలిచారు. అయితే కొన్నిసార్లు ఈయన జాతకం నిజం కావడంతో ఈయనని నమ్మే వారి సంఖ్య అధికమైంది కానీ ఇటీవల కాలంలో వేణు స్వామి చెప్పిన జాతకాలన్నీ కూడా నిజం కాకపోవడంతో ఈయన ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచిన ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రాబోతున్నారని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది

Related News

ట్రెండింగ్ వార్తలు