నటి దీపికాకు పుట్ట బోయేది కొడుకా.. కూతురా జ్యోతిష్యులు ఏం చెప్పారంటే?

July 7, 2024

నటి దీపికాకు పుట్ట బోయేది కొడుకా.. కూతురా జ్యోతిష్యులు ఏం చెప్పారంటే?

Deepika Padukone: ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ప్రస్తుతం గర్భంతో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ క్రమంలోనే నటుడు రణవీర్ సింగ్ తో ప్రేమలో పడిన ఈమె పెద్దల సమక్షంలో తనని వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె తల్లి కాబోతున్నారని విషయాన్ని ప్రకటించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని తెలియజేసిన ఈమె ప్రకటన తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. అయితే ఇటీవల కల్కి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె పాల్గొనడంతో ఈమె బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈమె సెప్టెంబర్ నెలలో తల్లిగా ప్రమోషన్ పొందనున్నారు.

ఈ క్రమంలోనే దీపిక పదుకొనే మగ బిడ్డకు జన్మనిస్తారా లేక ఆడబిడ్డకు జన్మనిస్తారా అనే విషయంపై ప్రముఖ జ్యోతిష్యులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పండిట్ జగన్నాథ్ గురూజీ దీపికా పదుకొనికి పుట్టబోయే బిడ్డ ఎవరు అనే విషయాన్ని వెల్లడించారు. రణ వీర్ సింగ్ దీపిక జాతకం ప్రకారం వారికి తొలి సంతానంగా మగ బిడ్డ జన్మించబోతున్నారని తెలిపారు.

ఈ బిడ్డ కారణంగా తల్లిదండ్రులకు మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయని మరింత అదృష్టం కలిసి రాబోతుందని తెలిపారు. మగ బిడ్డ వారి జీవితాలలో యువరాజుగా మారడమే కాకుండా తల్లిదండ్రులకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా తీసుకువస్తారని తెలియజేశారు. మరి ఈమె విషయంలో పండిట్ జగన్నాథ్ గురూజీ చెప్పిన జోస్యం నిజమా కాదా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాలి

Related News

ట్రెండింగ్ వార్తలు