‘అతిథి దేవో భవ’ను ఆద‌రిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు – ఆది సాయికుమార్

January 9, 2022

‘అతిథి దేవో భవ’ను ఆద‌రిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు – ఆది సాయికుమార్

ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. పొలిమేర నాగేశ్వర్ ద‌ర్శ‌కుడు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌లైన ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..ఆది సాయి కుమార్ మాట్లాడుతూ సినిమా విడుద‌లైన మొద‌టి షో నుంచి బాగుంద‌ని చాలా ఫోన్లు వ‌చ్చాయి. వైజాగ్, సీడెడ్ ల‌లో క‌లెక్ష‌న్లు చాలా బాగున్నాయ‌ని రిపోర్ట్ వ‌చ్చింది. ఇక నా పెర్ ఫార్మెన్స్‌కూ హీరోయిన్ న‌ట‌న‌కు అప్లాజ్ వ‌స్తోంది. పాట‌లు కూడా మంచి ఆద‌ర‌ణ పొందాయి. సప్త‌గిరి కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో మ‌రో స్థాయిలో వుంది. ఎక్క‌డా వినోదం మిస్ కాకుండా ద‌ర్శ‌కుడు తీశాడు. బ‌య‌ట కోవిడ్ వంటి వాతావ‌ర‌ణ వున్నా ఇంత ఆద‌ర‌ణ పొంద‌డం ఆనందంగా వుంది. త‌ప్ప‌కుండా ఇంకా చూడ‌నివారుంటే చూసి ఆనందించండి అని తెలిపారు. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని. వైజాగ్‌, సీడె్డ్‌ల‌లో హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌లో ర‌న్ అవుతోంద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు.

Read Moreప్ర‌భాస్ `ప్రాజెక్ట్ కె` రిలీజ్‌డేట్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత‌ అశ్వ‌నిద‌త్‌

ట్రెండింగ్ వార్తలు