పొట్టేలు తలకాయలతో బాలయ్యకు దండ.. హిందూపురంలో బాలయ్య మాస్ క్రేజ్!

June 8, 2024

పొట్టేలు తలకాయలతో బాలయ్యకు దండ.. హిందూపురంలో బాలయ్య మాస్ క్రేజ్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ ఏపీ ఎన్నికలలో పోటీ చేస్తూ ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణ ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. గత రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేసిన అఖండ మెజారిటీతో గెలిచారు. ఇక మూడోసారి కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 32వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇలా బాలకృష్ణ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపురంలో అభిమానులు బాలయ్య గెలుపును పండగలా జరుపుకుంటున్నారు. అయితే బాలకృష్ణకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా హిందూపురంలో బాలయ్య గెలవడంతో అక్కడ అభిమానులు భారీ స్థాయిలో పొట్టేళ్లను నరికి వాటి తలలతో దండగా కుట్టి బాలకృష్ణ ఫ్లెక్సీ కి వేయటంతో సంచలనంగా మారింది.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసినటువంటి నెటిజన్స్ బాలయ్యకు ఇదెక్కడి మాస్ క్రేజ్ అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు మీ ఆనందం కోసం ఇలా మూగజీవాలను బలి తీయడం మంచిది కాదు అభిమాన ఉంటే మరోలా చాటుకోవాలి కానీ ఇది ఎక్కడి అరాచకం అంటూ ఈ వీడియో పై వ్యతిరేకత చూపుతున్నారు.

మొత్తానికి బాలయ్యకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం అవుతుంది. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబి దర్శకత్వంలో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Read More: రామోజీరావు మృతిపై చిరు.. తారక ఎమోషనల్ ట్వీట్!

ట్రెండింగ్ వార్తలు