ఆ విషయంలో బాలయ్య బాబు కూతురిని ఫాలో అవుతున్నారా.. ఆ సక్సెస్ కు కారణం అదేనా?

May 11, 2024

ఆ విషయంలో బాలయ్య బాబు కూతురిని ఫాలో అవుతున్నారా.. ఆ సక్సెస్ కు కారణం అదేనా?

ఇటీవల కాలంలో బాలయ్య బాబు నటించిన సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ అవుతుండడంతో బాలయ్య బాబు అదే ఊపుతూ మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుబోతున్నారు. కెరీర్‌ ప్రారంభంలో ఇలా వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో దూసుకుపోతున్నారు. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక బాలయ్య బాబు గత మూడు సినిమాలు అయిన అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్నారు. ఈ వయసులో కూడా సినిమాలలో నటిస్తూ వరుసగా హిట్లు అందుకోవడంతో అభిమానులు బాలయ్య బాబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే ఇటీవల అనిల్‌ రావిపూడితో భగవంత్‌ కేసరి చిత్రంలో నటించారు బాలయ్య. ఇది బాలయ్య జోనర్‌ మూవీ కాదు, ఇందులో ఫన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, కూతురు సెంటిమెంట్‌, ఇన్‌స్పైర్‌ చేసే అంశాలు ఉన్నాయి. బాలయ్యకి ఒక కొత్త తరహా సబ్జెక్ట్ అని చెప్పాలి. అయినా ఈ మూవీతో హిట్‌ కొట్టాడు. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా అన్ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే షో చేసి మెప్పించడంతో పాటు తనలో ఉన్న మరొక యాంగిల్ ను కూడా బయట పెట్టారు. ఇది ఇండియాలోనే టాప్‌ రేటెడ్‌ షోగా నిలిచింది. ఫస్ట్ టైమ్‌ బాలయ్య చేసిన షో కావడం విశేషం. దీంతో ఆయనలోని ఫన్నీ యాంగిల్‌, కామెడీ యాంగిల్‌ ఇందులో చూపించారు.

అది ఆడియెన్స్ కి బాగా నచ్చింది. దీంతో షోని టాప్‌లో నిలబెట్టారు. అయితే బాలయ్యలో వచ్చిన మార్పుకి, సినిమాల పరంగా వరుస విజయాలకు సంబంధించిన ఒక బలమైన కారణం ఉందట. దాని వెనకాల ఒక వ్యక్తి కూడా ఉన్నారట. ఆ వ్యక్తి మరెవరో కాదు ఆయన చిన్న కూతురు తేజస్విని ఉన్నారట. ఆమెకి క్రియేటివ్‌ సైడ్‌ మంచి టాలెంట్‌ ఉందని, సినిమా మేకింగ్‌, ప్రొడక్షన్‌ వంటి వాటిపై ఆసక్తి ఉందని, సినిమాల్లో ఆమె ఇన్‌వాల్వ్ అవుతుందని తెలిపారు బాలయ్య చిన్న అల్లుడు, తేజస్విని భర్త భరత్‌. బాలయ్య యంగ్‌ డైరెక్టర్లతో పనిచేయడానికి కారణం తేజస్వినే అని, స్క్రిప్ట్ కి సంబంధించినగా,ఈ చేసే సినిమాలకు సంబంధించిన గానీ బాలయ్య ప్రతిదీ తేజూతో డిస్కస్‌ చేస్తారట.

ఆమె ఇన్‌వాల్వ్ మెంట్ ఉంటుందని తెలిపారు. ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుందని తెలిపారు. వీటిపై ఆమెకి ఆసక్తి ఎక్కువ మాత్రమే కాదు, మంచి పట్టు ఉందని కూడా భరత్‌ తెలిపారు. ఆమె ఫీడ్‌ బ్యాక్‌ ద్వారానే బాలయ్య యంగర్‌ డైరెక్టర్లతో పనిచేస్తున్నారని తెలిపారు. యంగ్‌ స్టర్స్ తో చేయడం వల్ల ఫ్రెష్‌నెస్‌ వస్తుందని, అదే ఇప్పుడు బాలయ్య సక్సెస్‌ మంత్రగా మారిందన్నారు భరత్. దీని వెనుకాల తేజస్విని పాత్ర ఉంటుందని అన్నారు. అంటే అందరూ బాలయ్య బాబుని ఫాలో అయితే బాలయ్య బాబు తన కూతురు తేజస్విని ఫాలో అవుతున్నారన్నమాట.

Read More: అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరోయిన్ సమంత.. నా దగ్గర జాబ్ చేస్తారా అంటూ!

ట్రెండింగ్ వార్తలు