మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్ ను సెలెక్ట్ చేసిన బాలయ్య!

July 8, 2024

మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్ ను సెలెక్ట్ చేసిన బాలయ్య!

Nandamuri Mokshagna: ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకోవడమే కాకుండా, పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ తన వారసురుని ఎప్పుడు ప్రకటిస్తారా అంటూ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ రాక కోసం నందమూరి అభిమానులు వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూనే ఇప్పటికే మూడు సంవత్సరాల సమయం గడిచిపోయిన ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు అయితే త్వరలోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఇలా మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారంటూ ఇటీవల ఒక వార్త వైరల్ గా మారింది.ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే మోక్షజ్ఞ కోసం కత్తి లాంటి అమ్మాయిని హీరోయిన్గా బాలకృష్ణ ఎంపిక చేశారని కూడా తెలుస్తుంది. మరి మోక్షజ్ఞ సినిమాలో ఛాన్స్ కొట్టేయబోతున్న ఆ లక్కీ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే..

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి శ్రీ లీల మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. గతంలో కూడా మోక్షజ్ఞ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అంటూ బాలకృష్ణ పలు సందర్భాలలో వెల్లడించారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల ఛాన్స్ కొట్టేసారని తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించి అన్ని విషయాలు అధికారికంగా తెలియనున్నాయి

ట్రెండింగ్ వార్తలు