ఎన్టీఆర్ కు రిప్లై ఇచ్చిన బాలయ్య కూతురు.. అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయం?

June 7, 2024

ఎన్టీఆర్ కు రిప్లై ఇచ్చిన బాలయ్య కూతురు.. అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయం?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి విజయం సాధించడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకొని అందరిని వరుస పెట్టి పిలుస్తూ మామయ్య బాబాయ్ అత్త అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు మామయ్యతో పాటు బాలయ్య బాబాయ్ అలాగే అత్తయ్య పురందేశ్వరి, లోకేష్ ఎంపీ భరత్ అలాగే పవన్ కళ్యాణ్ కి అభినందనలు అంటూ ఈయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ విధంగా ఎన్టీఆర్ అభినందనలు తెలియచేయడంతో చంద్రబాబు నాయుడు కూడా రిప్లై ఇస్తూ థాంక్యూ అమ్మ అంటూ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా బాలయ్య చిన్నల్లుడు ఎంపీ భరత్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఎన్టీఆర్ కి రిప్లై వెళ్లింది. అయితే ఈ పోస్ట్ చూస్తే కనుక భరత్ భార్య బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని చేశారని స్పష్టంగా అర్థమవుతుంది.

మరి ఈ పోస్టులో ఏముంది అనే విషయానికి వస్తే.. థాంక్యూ తారక్ అన్న, రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమంతా కృత నిశ్చయంతో ఉన్నాం. దేవర సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అంటూ రిప్లై ఇచ్చారు. అయితే టీ ట్వీట్ ఒకవేళ భరత్ కనుక చేసి ఉంటే ఎన్టీఆర్ ని అన్న అని కాకుండా బావ అని పిలిచేవారు.

ఇలా ఇందులో తారక్ అన్న అని ఉండటంతో తప్పకుండా ఈ ట్వీట్ తేజస్విని చేసి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు ఇలా ఆమె తారక్ అన్న అంటూ ఎంతో ఆప్యాయంగా ఈ పోస్ట్ చేయటంతో ఈ అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి ఆప్యాయత అనుబంధం గురించి తెలిసిన నేటిజన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన దేవర సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2, అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయ్యారు.

Read More: పవన్ కళ్యాణ్ గెలుపుతో సంచలన నిర్ణయం తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్?

ట్రెండింగ్ వార్తలు