డ్రగ్స్ తీసుకున్న హేమ.. పేరు మార్చుకొని పార్టీకి హాజరు

May 23, 2024

డ్రగ్స్ తీసుకున్న హేమ.. పేరు మార్చుకొని పార్టీకి హాజరు

బెంగళూరు రేవ్ పార్టీ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. పార్టీకి హాజరైనవారి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వారి రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. డ్రగ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్ అని తేలింది. మొదటి నుంచి బలంగా వినిపిస్తున్న నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ అని తేలిన వారిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ నోటీసులు కూడా జారీ చేసింది.

ఈ డ్రగ్స్ కేసులో నటి హేమ ఇప్పుడు సంచలనంగా మారింది. హేమ కూడా డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ అని తేలడంతో అందరి ఫోకస్ ఆమెపైనే పడింది. మొదటి నుంచి హేమ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి హాజరైనపుడు తన పేరు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హేమ తన పేరును కృష్ణవేణిగా మార్చుకొని పార్టీకి హాజరైయ్యారు. అయితే.. లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ నిజాన్ని తేల్చారు.

అయితే.. మొదటి హేమ తప్పించుకునే ప్రయత్నం చేశారు. తన పేరు బయటకు వచ్చినపుడు.. తాను హైదరాబాద్‌లోనే ఉన్నారనని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత రోజు బిర్యానీ వండుతూ మరో వీడియో రిలీజ్ చేశారు. ఆ పార్టీతో తనకు సంబంధం లేదని.. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. కానీ.. పోలీసులు హేమ ఫోటో రిలీజ్ చేసిన తర్వాత ఆమె స్వరం మారింది. ఇప్పుడు ఆమె మీడియాపై చిందులు వేస్తున్నారు. మీడియా వాళ్లు తనను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎవరేం చేస్తారో.. చేసుకోండని అంటున్నారు. ఈ కేసులో బెంగళూరు సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు.

Read More: కల్కి ఈవెంట్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. అందుకోసమే పెళ్లి చేసుకోలేదంటూ ఎక్స్ప్లనేషన్!

ట్రెండింగ్ వార్తలు