రేవ్ పార్టీ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన హేమ.. వైరల్ ఫీవర్ అంటూ?

May 27, 2024

రేవ్ పార్టీ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన హేమ.. వైరల్ ఫీవర్ అంటూ?

బెంగళూరు రేవ్ పార్టీలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే వీరందరికీ కూడా కర్ణాటక పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ఉన్నటువంటి నటి హేమ సైతం ఈ పార్టీలో పాల్గొన్నారని, ఈమె కూడా డ్రగ్స్ తీసుకున్నారని పోలీసుల ఆరోపణలు చేశారు.

ఇలా తన గురించి మీడియాలోనూ అలాగే సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో హేమ ఎప్పటికప్పుడు స్పందిస్తూ నేను ఇంట్లోనే ఉన్నానని నాకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కానీ ఆమెకు టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చింది ఇలా ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వారందరిని ఈనెల 27వ తేదీ విచారణకు హాజరు కావాల్సిందని నోటీసులు పంపారు.

ఇలా బెంగళూరు పోలీసులు నోటీసులు పంపడంతో హేమ తనకు వైరల్ ఫీవర్ అని తాను విచారణకు హాజరు కాలేనని డుమ్మా కొట్టారు.విచారణకు మరికొంత సమయం ఇవ్వవలసిందిగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులకు లేఖ రాసింది. అయితే ఈ లేఖపై సీసీబీ స్పందిస్తూ.. తాము ఈ లేఖను పరిగణలోకి తీసుకోలేమని తెలిపింది. హేమకు మరోసారి నోటీసులు పంపనున్నట్లు తెలియజేశారు.

ఈ విధంగా రేవ్ పార్టీలో భాగంగా పాల్గొన్నటువంటి సెలెబ్రిటీలందరికీ కూడా నోటీసులు పంపించారు. అయితే నోటీసులు పంపించినటువంటి వారిలో హేమతో పాటు కాంతి, సుజాత, రాజశేఖర్, చిరంజీవి, ఆషీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివాని, జైశ్వాల్, వరుణ్ చౌదరి తదితరులు ఉన్నారు.

ఇక ఈ రేవ్ పార్టీలో కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఏపీకి చెందినటువంటి ఓ మంత్రికి సంబంధించిన కారు అక్కడ ఉండడంతో ఈ విషయం కాస్త రాజకీయపరంగా కూడా చర్చలకు కారణమైంది.

Read More: తండ్రిగా ఎంతో గర్వపడుతున్నాను.. కొడుకు ఎదుగుదలపై మహేష్ ఎమోషనల్ పోస్ట్!

ట్రెండింగ్ వార్తలు