December 21, 2021
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో మలయాళ సూపర్‌హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్‌కు తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. తెలుగు ప్రేక్షకులు, పవన్ అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు రాశారు. ఈ మూవీని జనవరి 12న విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతి బరిలో తమ అభిమాన హీరో సినిమా ఉందని, ఈ సారి సంక్రాంతికి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్ చాలా ఆతృతగా భీమ్లా నాయక్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నా..ఇప్పటి వరకు భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు వెనకడుగు వేయలేదు. దానికి కారణం అక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది.
దాదాపుగా ఒక వారం రోజులుగా దిల్‌రాజు,రాజమౌళి,దానయ్య లాంటి ప్రముఖులు ఈ సినిమాను వాయిదా వేయించాలని గట్టిగా ప్రయత్నించారు. నిన్న త్రివిక్రమ్ ద్వారా పవన్ కళ్యాన్ ని కలిశారని ప్రస్తుత పరిస్థితిని వివరించారని పవన్ దానికి సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
దాంతో ఈ రోజు ప్రెస్‌మీట్ పెట్టి దిల్‌రాజు భీమ్లా నాయక్ వాయిదా విషయం చెప్పనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25 నప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. అదే కనుక నిజమైతే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశే అని చెప్పక తప్పదు.. ఇందులో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, ప్రోమోలు, పాటలు సినిమాపై ఉన్న అంచనాలు పెంచాయి.