Bheemla Nayak: భీమ్లానాయక్‌ మైనస్‌లు ఇవేనా?

February 23, 2022

Bheemla Nayak: భీమ్లానాయక్‌ మైనస్‌లు ఇవేనా?

Bheemla Nayak

భీమ్లానాయక్‌... మలయాళంలో హిట్‌ సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు తెలుగు రీమేక్‌. మల యాళంలో సచీ(ఇటీవలే మరణించారు) దర్శకత్వంలో ఫృద్వీరాజ్‌ సుకుమారన్, బీజూమీనన్‌ మెయిన్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. పోలీసాఫీసర్‌గా మారిన ఓ ట్రైబల్‌ ఏరియా హంతకుడు, ఓ ఆర్మీ హవాల్దార్‌ల ఈగో క్లాషేష్‌ నేపథ్యంలో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెరకెక్కింది. పోలీసాఫీసర్‌ అయ్యప్పన్‌ నాయర్‌గా బిజుమీనన్, కోషీ కురియన్‌గా బిజుమీనన్‌ చేశారు. అయితే ఈ చిత్రంలో రెండు పాత్రలు సమానంగా ఉంటాయి. ఒక సీన్‌లో అయ్యప్పన్‌ హీరో అయితే మరో సీన్‌లో కురియన్‌ హీరో. అందుకే ఈ సినిమా కు ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ టైటిల్‌ను గమనిస్తే…అయ్యప్పన్‌ నాయర్, కోషీ కురియన్‌ ఇద్దరు పేర్లు మిక్సయినట్లుగా తెలుస్తోంది. టైటిల్‌ విషయంలోనే సగం సక్సెస్‌ అయ్యారు దర్శకుడు సచీ.

మిస్‌ఫైరింగ్‌ టైటిల్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ తెలుగు రీమేక్‌లో పోలీసాఫీసర్‌ భీమ్లానాయక్‌(Bheemlanayak) పాత్రలో పవన్‌కల్యాణ్, ఆర్మీ హవాల్దారీ డేనియల్‌ శేఖర్‌ పాత్రలో రానా నటించారు. సాగర్‌ కె చంద్ర దర్శకుడు. అయితే ఈ సినిమాకుకేవలం పవన్‌కల్యాణ్‌ క్యారెక్టరే వచ్చేట్లుగా ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ పెట్టడం కరెక్ట్‌ కాదనిటైటిల్‌ అనౌన్స్‌మెంట్స్‌ సమయంలో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. సినిమాలో ఇద్దరి క్యారెక్టర్స్‌కు సమాన ప్రాముఖ్యత ఉంటుందని ఈ చిత్రం నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ అప్పట్లో స్టేట్‌మెంట్‌ పాస్‌ చేసిన కూడా నెటిజన్లు ఈ విషయాన్ని మాత్రం ఒప్పుకోలేదు. అలాగే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ సరసన మొదట్లో సాయిపల్లవి నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా నిత్యామీనన్‌ ఫిక్సయ్యారు. సేమ్‌రానా సరసన తొలుత ఐశ్వర్యామీనన్‌ ఓకే అయ్యారు. కొంత షూటంగ్‌ కూడా జరిగింది. కానీ ఫైనల్‌గా మళ్లీ సంయుక్తామీనన్‌ను హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసుకున్నారు చిత్రంయూనిట్‌.

ఆకట్టుకోని ట్రైలర్‌ ఫిబ్రవరి 21న భీమ్లానాయక్‌ ట్రైలర్‌ వచ్చింది. ట్రైలర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పవన్‌ అండ్‌ ఫ్యాన్స్‌. అయితే రిలీజైన భీమ్లానాయక్‌ ట్రైలర్‌ మాత్రం ప్రేక్షకులను, కనీసం పవన్‌కల్యాణ్‌ అభిమానులను కూడాఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు..ఈ ట్రైలర్‌లో పవన్‌కల్యాణ్‌ కంటే రానాయే ఎక్కువగా పవర్‌ఫుల్‌డైలాగ్స్‌ చెబుతారు. ఇక తమన్‌ మార్కిజం బ్యాగ్రౌండ్‌ స్కోర్, త్రిమిక్రమ్‌ పెన్‌ పవర్‌ భీమ్లానాయక్‌ట్రైలర్‌లో మాత్రం కనిపించలేదు. మరి..సినిమాలో ఏమైనా ఉంటాయా? అనేది చూడాలి. నిజానికిభీమ్లానాయక్‌ ట్రైలర్‌ను విడుదల చేయకూడదనే అనుకున్నారు. కానీ రిలీజ్‌ టైమ్‌ దగ్గర పడుతుండటంతో ఏదో ఒకటి చేయాలని ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు అదీ కూడ చెప్పిన గంటకు ఆలస్యంగా..!

డైరెక్టర్‌ ఎవరూ? భీమ్లానాయక్‌ డైరెక్టర్‌గా పేరు సాగర్‌ కె చంద్ర అని కనిపిస్తోంది. కానీ అంతా త్రివిక్రమ్‌ కన్నుసన్నల్లోనే కథ సాగిందని చెప్పుకోవచ్చు. భీమ్లానాయక్‌ స్టారై్టన రోజు తప్ప ఆ తర్వాత ఎప్పుడూ సాగర్‌ కె చంద్ర లొకేషన్స్‌లో ఉన్నట్టుగా ఫోటోలు రాలేదు. ఈవెన్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కూడా త్రివిక్రమ్‌నే కనిపించారు కానీ సాగర్‌కనిపించలేదు. తెరపై భీమ్లానాయక్‌కు డైలాగ్స్, స్క్రీన్‌ ప్లే అందించింది త్రివిక్రమ్‌మే. కానీ డైరెక్షన్‌ కూడా ఆయనే చెశారెమో? అన్న డౌట్స్‌ వచ్చేలా పరిణామాలు జరిగాయి.

రన్‌టైమ్‌ ట్రిమ్‌! మలయాళంలోని అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా రన్‌టైమ్‌ 175 నిమిషాలు. భీమ్లానాయక్‌ రన్‌ టైమ్‌ 145 నిమిషాలు. ఒరిజినల్‌ సినిమాతో పోలీస్తే భీమ్లానాయక్‌ రన్‌ టైమ్‌ దాదాపు 30 నిమిషాలు తగ్గింది. ఈ మూఫ్పై నిమిషాల ప్రభావం ఎవరి క్యారెక్టర్‌పై పడుతుంది? అనేది చూడాలి. భీమ్లానాయక్‌ క్యారెక్టర్‌ పై అయితే పడదు. మరి..రానా క్యారెక్టర్‌ను తగ్గించి ఉంటారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం పవన్, నిత్యా మీనన్‌ కాంబినేషన్‌లో తీసిన ‘అంత ఇష్టం ఏంటయ్యా’ సాంగ్‌ సినిమాలో ఉండదు అంటున్నారు. మరి.. తగ్గిన రన్‌టైమ్‌ సినిమాపై ఎంత ప్రభావం చూపిస్తుంది? అనేది చూడాలి.

Readmore Directorteja: అనౌన్స్‌మెంట్స్‌ రిలీజ్‌ అవుతాయా?

ట్రెండింగ్ వార్తలు