February 3, 2022
Bheemla Nayak: ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని ఎప్పుడు లేనట్టుగా టాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు రెండేసి విడుదల తేధీలను ప్రకటిస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా పవన్ కల్యాణ్ రానా కాంబినేషన్‌లో తెరకెక్కిన `భీమ్లానాయక్`(Bheemla Nayak). కూడా ఫిబ్రవరి 25 లేదంటే ఏప్రిల్ 1 అని రెండు రిలీజ్ డేట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ రెండు తేధీలలో ఏ తారీకున భీమ్లా నాయక్ రావొచ్చనేది పవన్ రానా అభిమానులకు పెద్ద మిస్టరీగా మిగిలింది. అయితే నిర్మాత చినబాబు మాత్రం ఫిబ్రవరి 25కే ఓటేసినట్టు టాక్. అందులో భాగంగానే ఇటీవల భీమ్లా నాయక్ సినిమాను అంతా రెడీ చేసి పవన్‌కు చూపించారు. పవన్ కూడా ఔట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారని టాక్.
ఫిబ్రవరి 25నే మనసులో పెట్టుకుని ట్రైలర్ ని కూడా కట్ చేసి పెట్టారట. 2 నిమిషాల 20 సెకన్ల పాటు సాగే ఈ ట్రైలర్… పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించడం ఖాయం అని తెలుస్తోంది. విడుదల తేధి దగ్గరలోనే ఉండడంతో భారీగా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 10లోపు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసి 11 నుంచి ప్రమోషన్లు మొదపెట్టాలనేది ప్లాన్. అంటే ఈ నెల 12 లేదా 13న భీమ్లా నాయక్ ట్రైలర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ రీసెంట్‌గా విదేశీయాత్రను పూర్తి చేసుకుని త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొననున్నారు. మొఘలాయిలు, కుతుబ్ షాహీల నేపథ్యంలో చారిత్రాత్మక చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Read More: Mahaan Trailer: రియల్ తండ్రీ కొడుకుల రీల్ యుద్ధం మహాన్