భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌పై తెలంగాణ పోలీసుల అభ్యంత‌రం!!

September 3, 2021

భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌పై తెలంగాణ పోలీసుల అభ్యంత‌రం!!

ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకుడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియంస తెలుగు రీమేక్ గా ఈ మూవీ తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే.. కాగా ఇందులో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పొలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు.

పవన్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు. భీం భీం భీం భీం భీమ్లానాయక్..బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్.. అంటూ సాగే ఈ పాట విడుద‌లైన 24గంట‌ల్లో 9.7 మిలియ‌న్ల వ్యూస్ సాధించి ద‌క్షినాదిలోనే ఒకే రోజలో ఎక్కువ‌మంది చూసిన పాట‌గా రికార్డ్ సాధించింది. అయితే పాట‌లో కొన్ని లైన్స్ తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ లోని ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

“తెలంగాణ పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్. తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగొట్టం. రామజోగయ్య శాస్త్రికి ఒక పోలీస్ పరాక్ర‌మం గురించి వివరించేందుకు తెలుగులో ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టున్నాయి” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ పై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు