BheemlaNayak: టైటిల్‌ మార్చండి డైరెక్టర్‌ సలహా!

February 22, 2022

BheemlaNayak: టైటిల్‌ మార్చండి డైరెక్టర్‌ సలహా!

మరో మూడు రోజుల్లో రిలీజ్‌ ఉన్న భీమ్లానాయక్‌(BheemlaNayak) టైటిల్‌ను మార్చమని చెబుతున్న ఆ డైరెక్టర్‌ ఎవరో కాదు..రామ్‌గోపాల్‌వర్మ. ఫిబ్రవరి 21న భీమ్లానాయక్‌ ట్రైలర్‌ వచ్చింది. కానీ పవన్‌ ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయింది. పైగా పవన్‌ పోషించిన భీమ్లానాయక్‌ క్యారెక్టర్‌ కన్నా, ఇందులో రానా పోషించిన డేనియల్‌ శేఖర్‌ పాత్రకే ఎక్కువ డైలాగ్స్‌ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో భీమ్లానాయక్‌ ట్రైలర్‌ను చూసిన ఆర్‌జీవీ భీమ్లానాయక్‌ టైటిల్‌ను డేనియల్‌ శేఖర్‌గా మార్చాలెమో! అన్నట్లుగా ట్వీట్స్‌ చేశాడు. ఆర్‌జీవీ వ్యంగ్యంగా అన్నా..భీమ్లానాయక్‌ (BheemlaNayak) ట్రైలర్‌ను చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఆర్‌జీవీనే సపోర్ట్‌ చేస్తున్నారు మరీ..!

ఇక మలయాళ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న భీమ్లానాయక్‌ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. రానా, పవన్‌కల్యాణ్‌లు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్తామీనన్‌ హీరోయిన్స్‌ కాగా, రావురమేష్, మురళీశర్మ, సముద్రఖని కీలక పాత్రధారులు. సాగర్‌ కె చంద్ర దర్శత్వంలో రూపొందిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ డైలాగ్స్, మాటలు అందించారు. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.

Read More: NBK107: కాపీనా? రీమేకా?

ట్రెండింగ్ వార్తలు